Abn logo
Oct 24 2021 @ 07:18AM

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇల్లు సీజ్‌

                - పోరంబోకు స్థలం ఆక్రమణ


చెన్నై(Tamilnadu): నటుడు మన్సూర్‌ ఆలీఖాన్‌ ఇంటిని కార్పొరేషన్‌ ఉన్నతాధికారు లు శనివారం సీజ్‌ చేశారు. ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని ఇంటిని నిర్మించుకున్నందుకుగాను కోర్టు ఉత్తర్వు మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. స్థానిక చూళైమేడు పెరియార్‌ పాదై పడమటి వైపున 2500 చదరపుటడుగుల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ పొరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని మన్సూర్‌ అలీఖాన్‌ ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ ఇంటిని తొలగించడానికి కార్పొరేషన్‌ అధికారులు ఆయనకు పలుమార్లు నోటీసు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో కార్పొరేషన్‌ అధికారులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఉత్తర్వు మేరకు శనివారం ఉదయం కార్పొరేషన్‌కు చెందిన అధికారులు ఆ ఇంటికి తాళం వేసి సీలుపెట్టారు.

ఇవి కూడా చదవండిImage Caption