బెంగళూరు: ప్రముఖ శాండల్ వుడ్ నటి భావన మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్చేవాలా ఈమేరకు శుభా కాంక్షలు చెప్పారు. ఈమేరకు బుధవారం ట్వీట్ చేసిన సుర్జేవాలా గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన నటి భావనా రామణ్ణ మరోసారి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారని స్వాగతించానన్నారు. పార్టీ కోసం ఆమె పనిచేసేందుకు సిద్ధమని వచ్చారని రాసుకున్నారు. ఇలా పార్టీకు బలం చేకూరాలంటే అంకితభావం కలిగినవారంతా చేతులు కలపాలన్నారు. గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన భావనా 2018 ఎన్నికల వేళ చిత్రదుర్గ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అధిస్ఠానం టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. 2018 మే నెలలోనే బీజేపీలో చేరారు. మూడున్నరేళ్ళపాటు బీజేపీలో కొనసాగిన భావన మరోసారి కాంగ్రెస్‌లో చేరారు.