Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిమిడిపోయిన నెనరెసరు

జిగురుబతుకు ఊడల ఊగని అడుగు

ఎదగోడ చెరగని ఆమె నూనెనీడ

ముడిలేని కోక తాటికొసకుచ్చు అంటిన తావి

కట్టతప్పిన దారి నిట్టనిలిచిన వేలుపు

ఊరుపు సైగల కొనల కొలిచే అచూపు


నీరెండతలపులు సోకి జోగని నూగు

జలగడ్డి తాకిడి చీరిన పొరతెరల చెమ్మ

అంటుకున్న దిగులు ఊటమాట

తెగనితోవ పేనని గొంతులో చేపముల్లు

సొంపుసడి గుసగుసల తవ్వుగల్లు దిక్కులచూపు

తడికొలకు జల్లెడ చివికిన మట్టు


దరి కలపని గాలితీవెల వంతెనవేళ్ళు

ఆపద పొదల పొంచిన జబ్బలచేతులు


నిమిరే ఊసుతెడ్డు లేని చిక్కటి రాగిజావపగలు

ముంపొగ దాచిన పలచటి చీకటిముక్కల రాతిరి

ఆమెముసురు తేలిపోయిన మబ్బెనక వచ్చి

చిమిడిపోయిన నెనరెసరు వార్చే పొద్దుబుట్ట

కె. రామచంద్రారెడ్డి

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...