హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఐఐ, తెలంగాణ ‘ఇన్‌స్పైరింగ్ పీపుల్ ప్రాక్టీసెస్’ అవార్డును గెలుచుకుంది. భవిష్యత్ తరాల నైపుణ్యాలను, విధానాలను వాడకంలోకి తీసుకువచ్చినందుకు ఈ అవార్డు లభించింది. అవార్డును తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రాంతీయ అధిపతి వీ రాజన్న అందుకున్నారు.