ప్రభుత్వాస్పత్రుల్లో సీఐడీ సోదాలు!

ABN , First Publish Date - 2021-04-12T05:03:42+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఆదివారం సీఐడీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు చేశారు. కీలక రికార్డులను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాస్పత్రులో పాడైన పరికరాల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను టీడీఎస్‌ అనే సంస్థకు అప్పగించారు.

ప్రభుత్వాస్పత్రుల్లో సీఐడీ సోదాలు!




రోజంతా సాగిన తనిఖీలు

కీలక పత్రాలు స్వాధీనం

రింగురోడ్డు, ఏప్రిల్‌ 11:జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఆదివారం సీఐడీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు చేశారు. కీలక రికార్డులను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాస్పత్రులో పాడైన పరికరాల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను టీడీఎస్‌ అనే సంస్థకు అప్పగించారు. అయితే ఆ సంస్థ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించింది. దీంతో కొద్ది నెలల కిందట విచారణ ప్రారంభమైంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని మహరాజ కేంద్రాస్పత్రి, టీబీ విభాగం, డీఎంహెచ్‌వో కార్యాలయం, ఘోషాసుపత్రితో పాటు అన్ని సీహెచ్‌సీలను సీఐడీ బృందాలు తనిఖీ చేశాయి. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. టీబీఎస్‌ సంస్థ కాంట్రాక్టు సమయంలో ఎన్ని పరికరాలు పాడయ్యాయి? మరమ్మతులు చేశారా? వారంటీ ఉన్న పరికరాలు ఉన్నాయా? వంటి వివరాలను సిబ్బందిని అడిగినట్టు తెలుస్తోంది. అయితే  సోదాల వివరాలను సీఐడీ అధికారులు కానీ.. వైద్యఆరోగ్య అధికారులు, సిబ్బంది బయటకు చెప్పకపోవడం విశేషం.  












Updated Date - 2021-04-12T05:03:42+05:30 IST