బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో జరిగిన క్వారీ పేలుడుపై సీఐడీ దర్యాప్తునకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. ఈ రోజు చిక్కబల్లాపూర్‌లోని హిరేనాగల్లి వద్ద క్వారీలో జరిగిన పేలుడుపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి చెప్పారు.