జీజీహెచ్‌లో సీఐడీ సోదాలు

ABN , First Publish Date - 2021-04-12T04:53:43+05:30 IST

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌)లో ఆదివారం సీఐడీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు చేశారు. కీలక రికార్డులను పరిశీలించారు.

జీజీహెచ్‌లో సీఐడీ సోదాలు
శ్రీకాకుళంలో జీజీహెచ్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 11: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌)లో ఆదివారం సీఐడీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు చేశారు. కీలక రికార్డులను పరిశీలించారు. రాష్ట్రంలో 2015 నుంచి 2018 మధ్య కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చిన సదుపాయాలు, సౌకర్యాలు, సామగ్రిని పరిశీలించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా మొదటిగా శ్రీకాకుళం జీజీహెచ్‌లో సీఐడీ డీఎస్పీ కాళిదాస్‌, సీఐ బుచ్చిరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ వైద్యకళాశాల, ఆస్పత్రిలోని  పరికరాలు, వాటి వినియోగంపై ఆరా తీశారు. 2015-2018 మధ్యకాలంలో  సామగ్రి మెయింటెనెన్స్‌ కోసం కేటాయించిన నిధులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి విభాగంలో ఉన్న ఉద్యోగి నుంచి సమాచారాన్ని సేకరించారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న 82 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 18 ఏరియా ఆసుపత్రుల్లో ఉన్న సదుపాయాలు, సామగ్రిపై జిల్లావైద్యఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి సమాచారాన్ని సేకరించారు. మరో వారంరోజులపాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు.  

Updated Date - 2021-04-12T04:53:43+05:30 IST