Abn logo
Apr 13 2021 @ 00:15AM

ప్రభుత్వాస్పత్రుల్లో సీఐడీ తనిఖీలు


టీబీఎస్‌ సంస్థ బిల్లులపైనే ప్రధాన దృష్టి... నిధులు, ఖర్చు, వసతులపై ఆరా


అనంతపురం వైద్యం, ఏప్రిల్‌12: ప్రభుత్వాస్పత్రులపై సీఐడీ దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతోంది. అందులో భాగంగా జిల్లాలోనూ సర్కారు ఆస్పత్రుల్లో సీఐడీ విస్తృత తనిఖీలు కొనసాగిస్తోంది. రెండ్రోజులుగా ప్రత్యేక బృం దాలు జిల్లాలో తిరుగుతూ ప్రభుత్వాస్పత్రుల్లో తనిఖీలు సాగిస్తున్నాయి. 87 పీహెచ్‌సీలు, 16 సీహెచ్‌సీలు, 3 ఏరియా ఆస్పత్రులతోపాటు జిల్లా సర్వజనాస్పత్రి వైద్య కళాశాలలోనూ సీఐడీ తనిఖీలు చేపడుతోంది. ఆదివారం రాయదుర్గం, గుమ్మఘట్ట ఆస్పత్రుల్లో సీఐడీ తనిఖీలు చేపట్టింది. సోమవారం జిల్లాలో దాదాపు 50 ఆస్పత్రుల్లో తనిఖీలు కొనసాగించినట్లు సమాచారం. నేరుగా సీఐడీ ప్రతినిధులు ఆస్పత్రులకు వెళ్లి, తనిఖీలు సాగిస్తున్నారు. జిల్లా సర్వజనాస్పత్రి, వైద్య కళాశాలలో సీఐడీ సీఐ రాజేంద్రప్రసాద్‌ యాదవ్‌ తనిఖీలు సాగించారు. ప్రధానంగా 2015 నుంచి 2019 వరకు ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన యంత్రా లు, అందుకు టీబీఎస్‌ సంస్థ చేపట్టిన మరమ్మతులు, ఖర్చుల వివరాలపై సీఐడీ ఆరా తీసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆస్పత్రులకు మంజూరైన నిధులు, వాటి ఖర్చు, మిగులు సొ మ్ము, వసతులు, రోగులకు వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది తదితర వివరాలపై సమాచా రం సేకరించారని తెలిసింది. జిల్లాలో సీఐడీ తనిఖీలు సాగుతుండటంతో వైద్య వర్గాల్లో ఆందోళన మొదలైంది. గతంలో ఆయా ఆస్పత్రుల్లో పనిచేసిన వారు బిల్లులు చేశారు. వాటిపై సీఐడీ తనిఖీలకు దిగటంతో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యుల్లో టెన్షన్‌ నెలకొంది.


Advertisement
Advertisement
Advertisement