ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీఐడీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-13T05:28:17+05:30 IST

శృంగవరపుకోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో సోమవారం సీఐడీ తనిఖీలు చేపట్టింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీఐడీ తనిఖీలు

 శృంగవరపుకోట, ఏప్రిల్‌ 12: శృంగవరపుకోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో సోమవారం సీఐడీ తనిఖీలు చేపట్టింది. గత ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ పార్ధసారధి పరిశీలించారు. పలు రికార్డులను చూశారు. తనకు అనుమానం వచ్చిన చోట రిమార్కులు రాసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆర్‌.త్రినాథరావు ఉన్నారు. 

వేపాడ: వేపాడ, బొద్దాం పీహెచ్‌సీల్లో సోమవారం సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2015-18 కాలంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు వైద్యపరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు విశాఖ రీజియన్‌  ఎస్‌ఐ రామగణేష్‌ ఆధ్వర్యంలో బృందం పీహెచ్‌సీలను సందర్శించి పరికరాల వినియోగంపై దర్యాప్తు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

శృంగవరపుకోట రూరల్‌(జామి): కొట్టాం పీహెచ్‌సీతో పాటు జామి మండలం జామి, అలమండ పీహెచ్‌సీలను సోమవారం సీఐడీ బృందం పరిశీలి ంచింది. ఈమేరకు ఈ బృందం అప్పట్లో వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా కామినేని శ్రీని వాస్‌ ఆధ్వర్యంలో 2015 నుంచి 2018 మధ్య కొనుగోలు చేసిన వైద్యపరికరాల పని తీరు చూశారు. ఈ కాలంలో కొనుగోలుచేసి పీహెచ్‌సీలకు పంపిన ఐఎల్‌ఆర్‌, డీరఫ్రిజ్‌లు, బీపీ ఆపరేటర్లు, రేడియేషన్‌ లైటర్లు చూశారు.

లక్కవరపుకోట: లక్కవరపుకోట పీహెచ్‌సీలో సోమవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2015 -2018 సంవత్సరాల వరకు పీహెచ్‌సీకి వచ్చిన మందులు, విలువైన వస్తువుల విషయమై అధికారులు ఆరాతీసినట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని డీఎంఅండ్‌ హెచ్‌ఓ కార్యాలయం నుంచి ఇంకా ఏమైనా వస్తువులు వచ్చాయా? అని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.



దండు మారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి 

విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 12: దండుమారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎస్పీ రాజకుమారి తెలిపారు. నగరంలోని కంటోన్మెంట్‌లో  దండుమారమ్మ  ఆలయంలో  అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ..  13 నుంచి  20 వరకూ దేవి ఉత్సవాలు  జరగను న్న  నేపథ్యంలో ఇప్పటికే దాతలు, ఆలయ కమిటీ సభ్యుల చొరవతో కొన్ని ఆధునికీకరణ పనులు చేపట్టామ న్నారు. పది విగ్రహాలు, ప్రధాన గేటు, ప్రధాన ద్వారానికి వెండితాపడం, తులసి కోట, అంతరాలయం చుట్టూ  స్టీలు గేట్లను ఏర్పాటు చేశామని చెప్పారు.  ఆర్ముడ్‌ రిజర్వ్‌డ్‌ పోలీసుల శ్రమదానంతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సత్యనారాయణరావు, ఏఆర్‌ డీఎస్పీ శేషాద్రి, ట్రాఫిక్‌ డీఎ స్పీ మోహనరావు, దిశా మహిళా డీఎస్పీ త్రినాథ్‌, ఎస్‌బీ సీఐ రాంబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T05:28:17+05:30 IST