ప్రభుత్వాసుపత్రుల్లో కొనసాగుతున్న సీఐడీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-13T05:24:25+05:30 IST

ప్రభుత్వ వైద్యశాలల్లో జరిగిన అవకతవకలపై జిల్లాలో సీఐడీ తనిఖీలు సొమవారం కొనసాగాయి. ఆసుపత్రుల్లో బయో మెడికల్‌ పరికరాల కొనుగోలులో అవకతవకలపై మంగళగిరి సీఐడీ అధికారులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వాసుపత్రుల్లో కొనసాగుతున్న సీఐడీ తనిఖీలు
వైద్యశాలలో అధికారులను ప్రశ్నిస్తున్న సీఐడీ డీఎస్పీ

నెల్లూరు(క్రైం), ఏప్రిల్‌ 12: ప్రభుత్వ వైద్యశాలల్లో జరిగిన అవకతవకలపై జిల్లాలో సీఐడీ తనిఖీలు సొమవారం కొనసాగాయి. ఆసుపత్రుల్లో బయో మెడికల్‌ పరికరాల కొనుగోలులో అవకతవకలపై మంగళగిరి సీఐడీ అధికారులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు రీజియన్‌ అదనపు ఎస్పీ పీ రాజేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. నెల్లూరు సీఐడీ డీఎస్పీ రాంబాబు నేతృత్వంలో ఆరు బృందాలు జిల్లా వ్యాప్తంగా పరిశీలన జరిపాయి. మొత్తం 96 ఆసుపత్రుల్లో బయో మెడికల్‌ పరికరాలకు సంబంధించిన రికార్డులు, పరికరాలను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందించినట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-04-13T05:24:25+05:30 IST