సీఐడీ అదుపులో వలంటీర్‌

ABN , First Publish Date - 2020-05-29T07:48:23+05:30 IST

హైకోర్టుపైనా, జడ్జీలపైనా సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కామెంట్లు పెట్టిన కేసులో ప్రకాశం

సీఐడీ అదుపులో వలంటీర్‌

  • హైకోర్టు, జడ్జీలపై అభ్యంతరకర కామెంట్లకేసు

గిద్దలూరు, మే 28: హైకోర్టుపైనా, జడ్జీలపైనా సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కామెంట్లు పెట్టిన కేసులో ప్రకాశం జిల్లా కొమరోలు మండలం మూలపల్లి గ్రామానికి చెందిన వలంటీర్‌ డి.కొండారెడ్డిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ సుధాకర్‌ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టిన వారిలో కొండారెడ్డి ఒకరు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు కోర్టుకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలామందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బుధవారం రాత్రి అమరావతి నుంచి వచ్చిన అధికారులు మూలపల్లిలో కొండారెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. 

Updated Date - 2020-05-29T07:48:23+05:30 IST