Abn logo
Apr 17 2021 @ 00:28AM

ఆసుపత్రిలో సీఐడీ తనిఖీలు

పాలకొండ : జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో సీఐడీ సోదాలు జరుగుతున్న క్రమంలో శుక్రవారం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో మందుల కుంభకోణం జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ఈ సోదాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సోదాలు చేస్తున్న శ్రీనివాసరావు వెల్లడించారు. ఇంతవరకు  దాదాపు 300 ఆసుపత్రుల్లో రికార్డులు పరిశీలించినట్టు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. 

సీతంపేట సీహెచ్‌సీలో....

సీతంపేట : సీతంపేట సామాజిక ఆసుపత్రిలో శుక్రవారం విశాఖ రీజనల్‌ సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ భవానీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దోనుబాయి, కుసిమి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందజేసిన మందులు వివరాలను తెలుసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. సీఐడీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.చంద్రమౌళి తదితరులు ఉన్నారు. Advertisement
Advertisement
Advertisement