ఎమ్మెల్యే ఆర్కేకు సీఐడీ పిలుపు

ABN , First Publish Date - 2021-03-18T02:24:11+05:30 IST

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నుంచి పిలుపువచ్చింది. అసైన్డ్ భూముల అంశంలో ఆర్కే ఫిర్యాదు మేరకు మాజీ ముఖ్యమంత్రి

ఎమ్మెల్యే ఆర్కేకు సీఐడీ పిలుపు

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నుంచి పిలుపువచ్చింది. అసైన్డ్ భూముల అంశంలో ఆర్కే ఫిర్యాదు మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి పి.నారాయణను కూడా నిందితుడిగా చేర్చింది. ఆర్కేకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. గురువారం విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆయనను అధికారులు ఆదేశించారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు... శుక్రవారం (ఈనెల 12న) సీఐడీ కేసు నమోదు చేసింది.


మంగళవారం ఉదయం సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. సీఐడీ అధికారులు రెండు బృందాలుగా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో నివాసంలోనే ఉన్న చంద్రబాబు నోటీసులు అందుకున్నారు. ‘‘ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం మిమ్మల్ని ప్రశ్నించాల్సి ఉంది. మీకు(ఏ1) మాత్రమే తెలిసిన వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. అందువల్ల... ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు  విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ రీజనల్‌ ఆఫీసుకు వ్యక్తిగతంగా హాజరు కావలెను’’ అని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-18T02:24:11+05:30 IST