Viral Video: మన ఎమ్మెల్యే సింహంలాంటోడు.. అడగకపోయినా సాయం చేస్తాడు: గుత్తి సీఐ స్వామి భక్తి

ABN , First Publish Date - 2021-09-29T18:46:13+05:30 IST

అనంతలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల పోలీసుల స్వామి భక్తి మితిమీరిపోతోంది. గుత్తి సీఐ రాము.. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని సింహంతో పోల్చుతూ పొగడ్తల్లో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది.

Viral Video: మన ఎమ్మెల్యే సింహంలాంటోడు.. అడగకపోయినా సాయం చేస్తాడు: గుత్తి సీఐ స్వామి భక్తి

అనంతపురం: అనంతలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల పోలీసుల స్వామి భక్తి మితిమీరిపోతోంది. గుత్తి సీఐ రాము..  గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని సింహంతో పోల్చుతూ పొగడ్తల్లో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది. పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘మన ఎమ్మెల్యే సింహంలాంటోడు. ఎవరికి ఎలాంటి సాయం చేయాలో మన ఎమ్మెల్యే సార్ చేస్తాడు. అడగక పోయినా సాయం చేసే వాడే లీడర్’’ అంటూ ఒక పోలీస్ ఆఫీసర్‌లా కాకుండా అధికార పార్టీ కార్యకర్తలా సీఐ రాము మారిపోయి ఎమ్మెల్యేని పొగడ్తలతో ముంచెత్తడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-09-29T18:46:13+05:30 IST