కృష్ణా: జిల్లాలోని గుడివాడలో ఇద్దరు సీఐల బేరసారాల వ్యవహారం సంచలనం కల్గిస్తోంది. గుడివాడ వన్‌టౌన్, టూటౌన్ సీఐలపై అభియోగాలు వచ్చాయి. లోక్ అదాలత్‌లలో రాజీకి వచ్చిన పాత కేసుల్లో కక్షిదారులను సీఐలు బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుడివాడలోని పలు సంస్థల నుంచి లంచాలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ విచారణ చేపట్టారు. ఈ అంశంపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని ఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి