Abn logo
Sep 23 2021 @ 01:00AM

స్థాయీ సంఘ సమావేశాలంటే చులకనా?

మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు

అధికారుల నిర్లక్ష్యం పట్ల జడ్పీ చైర్మన్‌ అసహనం

ఖిల్లా, సెప్టెంబరు 22: జిల్లా ప్రజల సమస్యలపై చర్చించేందుకు మినీ అసెంబ్లీగా భావించే స్థాయీ సంఘ సమావేశాల కు కొందరు అధికారులు నిర్లక్ష్యం వహించి హాజరు కావడం లేదని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు రాని వైద్యశాఖ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌ పై మండిపడ్డారు. ఆయనకు వెంటనే నోటీసు జారీ చేయాలని సీఈవో గోవింద్‌కు ఆదేశించారు. స్థాయూ సంఘ సమావేశాలంటే కొందరు అధికారులకు చులకన భావం ఉందని, అటు వంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు రాకుంటే తాము ప్రజలకు ఏ సమాధానం ఇవ్వాలని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంటే, అధికారులు చేస్తున్న విధానాలను నివేదిక రూపంలో స్థాయీ సంఘ సమావేశంలో ఇవ్వాల్సి ఉండగా.. చాలా మంది ఎటువంటి అనుమతులు లేకుండా సమీక్షలకు రాకుండా వారి కింది స్థాయి సిబ్బందిని పంపి మమ అనిపించుకుంటున్నారని, దీంతో ప్రజల ముందుకు ప్రజాప్రతినిధులు వెళ్లలేక పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో విద్య, వైద్యం వాటి అనుబంధ శాఖలపై సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భం గా చైర్మన్‌ మాట్లాడుతూ జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగకుండా చూడాల్సిన బాధ్యత వైద్య శాఖాధికారులపై ఉందని, వర్షాల ప్రభావంతో గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌కు ఆదేశించారు. అలాగే కొవిడ్‌ కేసులు తగ్గుతున్నందున క్రమంగా వచ్చే ఇతర రోగులకు సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.