వరవరరావును విడుదల చేయాలి: చుక్కా రామయ్య

ABN , First Publish Date - 2020-07-14T01:19:19+05:30 IST

అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యమకారుడు వరవరరావును మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య డిమాండ్ చేశారు.

వరవరరావును విడుదల చేయాలి: చుక్కా రామయ్య

మహబూబాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యమకారుడు వరవరరావును మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య డిమాండ్ చేశారు. సోమవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలో చుక్కా రామయ్య పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వరవరరావును మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని విజ్ఞప్తి చేశారు. చివరి దశలో ఆయనను మనోవేదనకు గురిచేయడం భావ్యం కాదన్నారు.

Updated Date - 2020-07-14T01:19:19+05:30 IST