ఎక్కువ పిల్లలను కనండి.. క్రైస్తవుల సంఖ్యను పెంచండి: మిజోరం చర్చి

ABN , First Publish Date - 2021-12-14T07:17:29+05:30 IST

క్రైస్తవులు మెజారిటీలో ఉన్న మిజోరం రాష్ట్రంలోని అతిపెద్ద చర్చి అయిన ప్రెస్బిటేరియన్ చర్చి శనివారం అక్కడి వివాహిత మిజో క్రిస్టియన్లకు ఎక్కువ పిల్లలను కనమని చెప్పింది. ప్రజలను ఈ దిశగా ప్రోత్సహించేందుకు మిజోరం ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మెటర్నిటి లీవ్‌‌లో మరింత పొడిగింపు ఇవ్వాలని...

ఎక్కువ పిల్లలను కనండి.. క్రైస్తవుల సంఖ్యను పెంచండి: మిజోరం చర్చి

క్రైస్తవులు మెజారిటీలో ఉన్న మిజోరం రాష్ట్రంలోని అతిపెద్ద చర్చి అయిన ప్రెస్బిటేరియన్ చర్చి శనివారం అక్కడి వివాహిత మిజో క్రిస్టియన్లకు ఎక్కువ పిల్లలను కనమని చెప్పింది. ప్రజలను ఈ దిశగా ప్రోత్సహించేందుకు మిజోరం ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మెటర్నిటి లీవ్‌‌లో మరింత పొడిగింపు ఇవ్వాలని.. దీనికోసం  చర్చి కమిటీ ప్రభుత్వానికి అప్పీల్ చేయాలని నిర్ణయించింది. 


తగ్గిపోతున్న మిజో క్రిస్టియన్ల జనాభాను పెంచేందుకు స్థానిక ప్రజలు ఎక్కువ పిల్లలను కనాల్సిన అవసరం ఉందని, ఇది ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైన అంశమని చర్చి కమిటీ సభ్యులు అన్నారు. గర్బస్రావాలు, కుటుంబ నియంత్రణలు చేసేందుకు క్రైస్తవ మతంలో అనుమతి లేదని.. ఇలాంటి చర్యల వల్లే ప్రస్తుతం మిజో క్రైస్తవుల జనాభా తగ్గిపోయిందని వారన్నారు.


ప్రెస్బిటేరియన్ చర్చితోపాటు మిజోరంలోని మరో ప్రముఖ చర్చి అయిన బాప్టిస్ట్ చర్చి.. అలాగే మిగతా చర్చిలు కూడా మిజోరం క్రైస్తవ ప్రజలను తమ అస్తిత్వం కోల్పోకుండా ఉండాలంటే.. ఎక్కువ పిల్లలను కనమని ఒత్తిడి చేస్తున్నాయి. చర్చిల అభిప్రాయంతో యంగ్ మిజో అసోసియషన్(YMA) కూడా ఏకీభవించింది. రాష్ట్రంలోని క్రైస్తవ ప్రజలు జనాభా పెంచేందుకు వివాహం చేసుకున్న జంటలు కృషి చేస్తూ ఉండాలని అందుకు వారికి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉండాలని యంగ్ మిజో అసోసియేషన్ నాయకులు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-12-14T07:17:29+05:30 IST