మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసిన క్రిస్టియన్‌ మత ప్రముఖులు

ABN , First Publish Date - 2020-08-13T23:09:11+05:30 IST

రాష్ట్ర మైనారీటీ సంక్షేమం, సీనియర్‌ సిటీజన్స్‌ వెల్ఫేర్‌ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను క్రిస్టియన్‌ కమ్యూనిటీ నాయకులు కలిశారు. ఈసందర్భంగా వారు మంత్రి కొన్నివిన్నపాలు చేశారు.

మంత్రి  కొప్పుల ఈశ్వర్‌ను కలిసిన క్రిస్టియన్‌ మత ప్రముఖులు

హైదరాబాద్‌: రాష్ట్ర మైనారీటీ సంక్షేమం, సీనియర్‌ సిటీజన్స్‌ వెల్ఫేర్‌ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను క్రిస్టియన్‌ కమ్యూనిటీ నాయకులు కలిశారు. ఈసందర్భంగా వారు మంత్రి కొన్నివిన్నపాలు చేశారు. ఇందులో కోవిడ్‌తో చనిపోయిన వారికి ప్రత్యేక స్మశాన వాటిక ఏర్పాటుకు భూమి కేటాయించాలని కోరారు. అలాగే ఇప్పటికే ప్రభుత్వం క్రిస్టియన్‌ గ్రేవ్‌యార్డుకోసం భూమి కేటాయిస్తామని ప్రకటించింది. దీనిపై కూడా వారు మంత్రితో చర్చించారు. క్రిస్టియన్‌లకు భూ కేటాయించే భూమిలో విషయంలో క్యాథలిక్‌లకు 30శాతం, ప్రొటెస్టంట్‌కమ్యూనిటీకి 70శాతం ప్రభుత్వం సిద్దంగా ఉందని, దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.


చర్చి మ్యారేజెస్‌ యాక్ట్‌-1872 ప్రకారం రిజిస్ర్టేషన్‌కు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో యాక్ట్‌ అమలు జరుగుతోందని, దీనిని అన్నిజిల్లాలకు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్నికోరారు. దీంతో పాటు క్రిస్టియన్‌ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ సమస్యలను వారు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి కొప్పుల సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ప్రభుత్వం ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. 

Updated Date - 2020-08-13T23:09:11+05:30 IST