నిషేధాన్ని కుదించినా.. ఒలింపిక్స్‌కు కోల్‌మన్‌ దూరం

ABN , First Publish Date - 2021-04-17T09:01:37+05:30 IST

ప్రపంచ 100 మీ. చాంపియన్‌ క్రిస్టియన్‌ కోల్‌మన్‌ టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నాడు.

నిషేధాన్ని కుదించినా.. ఒలింపిక్స్‌కు కోల్‌మన్‌ దూరం

జెనీవా: ప్రపంచ 100 మీ. చాంపియన్‌ క్రిస్టియన్‌ కోల్‌మన్‌ టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నాడు. డోప్‌ టెస్ట్‌లను మిస్సయినందుకు తనపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ కోల్‌మన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అయితే ఈ అమెరికన్‌ స్ర్పింటర్‌పై అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ గత అక్టోబరులో విధించిన రెండేళ్ల నిషేధాన్ని 18 నెలలకు కోర్టు కుదించింది. కానీ ఏడాదిన్నర నిషేధం ఈ నవంబరుకు కానీ ముగియదు. దాంతో జూలైలో జరిగే ఒలింపిక్స్‌కు అతడు అనర్హుడు కానున్నాడు. కాగా..ఉసేన్‌ బోల్ట్‌ స్థానంలో ఒలింపిక్‌ స్ర్పింట్‌ చాంపియన్‌ కాగల సత్తా కోల్‌మన్‌కు ఉందని అంచనా వేస్తుండడం గమనార్హం. 

Updated Date - 2021-04-17T09:01:37+05:30 IST