‘క్రైస్తవుల మనోభావాలతో ఆడుకోవద్దు’

ABN , First Publish Date - 2021-01-24T06:23:41+05:30 IST

క్రైస్తవంపై చంద్రబాబు వ్యాఖ్యలు చారిత్రక తప్పిదమని, క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎస్‌సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావుఽ ధ్వజమెత్తారు.

‘క్రైస్తవుల మనోభావాలతో ఆడుకోవద్దు’

కార్పొరేషన్‌(కాకినాడ), జనవరి 23: క్రైస్తవంపై చంద్రబాబు వ్యాఖ్యలు చారిత్రక తప్పిదమని, క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎస్‌సీ కార్పొరేషన్‌ చైర్మన్‌  జూపూడి ప్రభాకరరావుఽ ధ్వజమెత్తారు. కాకినాడలోని డి-కన్వన్షన్‌ హాల్‌లో సీవైఎఫ్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు బీహెచ్‌వీ మూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ సంఘాల సమావేశంలో జూపూడి ప్రసంగించారు. క్రైస్తవులు బలవంతంగా మత మార్పిడిలు చేస్తున్నారని చంద్రబాబు అనడం దారుణమన్నారు. క్రైస్తవులు టీడీపీని వదిలిపెట్టి ఇతర పార్టీలకు వెళ్లే యోచనలో ఉన్నారన్నారు. 

Updated Date - 2021-01-24T06:23:41+05:30 IST