న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్‌కు పక్షవాతం

ABN , First Publish Date - 2021-08-28T02:19:35+05:30 IST

న్యూజిలాండ్ క్రికెట్ లెజెండ్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం బారినపడ్డాడు. గత కొంతకాలంగా ‘అరోటిక్ డిసెక్షన్’ అనే

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్‌కు పక్షవాతం

సిడ్నీ: న్యూజిలాండ్ క్రికెట్ లెజెండ్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం బారినపడ్డాడు. గత కొంతకాలంగా ‘అరోటిక్ డిసెక్షన్’ అనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 51 ఏళ్ల కెయిన్స్‌ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అతడి ఆరోగ్యం క్షీణించగా, ఆ తర్వాత కోలుకున్నాడు. తాజాగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గుండెకు అత్యవసర శస్త్రచికిత్స చేస్తుండగా వెన్నెముకలో స్ట్రోక్ రావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కెయిన్స్‌ను ఆస్ట్రేలియాలోనే స్పెషలిస్ట్ స్పైనల్ ఆసుపత్రికి తరలించి రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు.  


ప్రపంచంలోని టాప్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన కెయిన్స్.. 1989-2004 మధ్య 62 టెస్టుల మ్యాచ్‌లు ఆడాడు. బౌలింగులో 29.4, బ్యాటింగులో 33.53 సగటు సాధించాడు. టెస్టుల్లో 3320 పరుగులు చేసి 218 వికెట్లు పడగొట్టగా, 215 వన్డేల్లో 4950 పరుగులు చేసి 201 వికెట్లు తీసుకున్నాడు. ఇంత గొప్ప రికార్డు కలిగిన కెయిన్స్‌ ప్రభ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో మసకబారింది.  

Updated Date - 2021-08-28T02:19:35+05:30 IST