ముగిసిన జ్యోతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-04-16T06:37:45+05:30 IST

ఉగాది వేడుకల్లో భాగంగా కల్లూరులోని చౌడేశ్వరి, చాముండేశ్వరి దేవీ జ్యోతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

ముగిసిన జ్యోతి ఉత్సవాలు
చాముండేశ్వరి అమ్మవారి జ్యోతులను ఊరేగిస్తున్న దృశ్యం

కల్లూరు, ఏప్రిల్‌ 15: ఉగాది వేడుకల్లో భాగంగా కల్లూరులోని చౌడేశ్వరి, చాముండేశ్వరి దేవీ జ్యోతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గురువారం తెల్లవారుజాము కల్లూరు ఊరు వాకిలి నుంచి జ్యోతి ఉత్సవాలను ప్రారంభించారు. జ్యోతులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పుర ప్రజలు, చిన్నారులు జ్యోతులకు బిందెలతో నీరు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. తొగటవీరులు అమ్మవారి ఖడ్గ పద్యాల నడుమ నందికోల సేవ, ఖడ్గ సేవా విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అగ్నిగుండం ప్రవేశం ద్వారా భక్తులు చాముండేశ్వరి అమ్మవారికి జ్యోతులను సమర్పించారు. చౌడేశ్వరి, చాముండేశ్వరి జ్యోతుల మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆలయాల చైర్మన్లు పోలిశెట్టి వెంకటేశ్వర్లు, గుంపు వెంకటేశ్వర్లు తెలిపారు. 

Updated Date - 2021-04-16T06:37:45+05:30 IST