Jul 10 2021 @ 08:00AM

చోటీ కంగనాకు బడీ కంగనా షాక్!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకు లెక్కకుమించిన అభిమానులున్నారు. వీరిలో ఒక చిన్నారి కూడా కంగనాను అమితంగా ఆరాధిస్తోంది. ఈ చిన్నారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇన్‌స్టా‌గ్రామ్‌లో చోటీ కంగనా పేరుతో ఐడీ కలిగిన ఈ చిన్నారి కంగనాను కాపీ చేస్తూ కనిపిస్తోంది. ఒక్కోసారి కంగనా లుక్‌తో, మరోమారు కంగనా డైలాగ్స్‌తో అందరినీ అలరిస్తోంది. ఈ ఫొటోలు చూసిన కంగనా కూడా ఆశ్చర్యపోయింది. ఈ చిన్నారికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేస్తూ... చోటీ నువ్వు చదువుకుంటున్నావా లేక రోజంతా ఇదే పనిచేస్తున్నావా? అని ప్రశ్నించింది. కాగా కంగనా ప్రస్తుతం ఇందిరా గాంధీ బయోపిక్... ఎమర్జెన్సీ కీ అనౌస్‌మెంట్ చిత్రంలో నటిస్తున్నారు. 

                                       ఆయుషీస్ కార్నర్ సౌజన్యంతో...


Bollywoodమరిన్ని...