నారాయణపేట జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ

ABN , First Publish Date - 2020-11-29T04:12:51+05:30 IST

నారాయణపేట జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లోని ఓ ఇంట్లో పట్టపగలే భారీచోరీ జరిగిన సంఘటన శనివారం వెలుగుచూసింది.

నారాయణపేట జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ

 ఏడు తులాల బంగారం 20తులాల వెండి, రూ.లక్ష నగదు అపహరణ 8 ఆధారాలు సేకరించిన క్లూస్‌టీం, గాలింపు చర్యలో డాగ్‌స్క్వాడ్‌



నారాయణపేట క్రైం, నవంబరు 28 : నారాయణపేట జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లోని ఓ ఇంట్లో పట్టపగలే భారీచోరీ జరిగిన సంఘటన శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... అశోక్‌నగర్‌లో కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్న గఫూర్‌ అనే వ్యక్తి స్థానిక నర్సిరెడ్డి చౌరస్తా సమీపంలోని మునిసిపల్‌ కాంప్లెక్స్‌లో చెప్పుల విక్రయ దుకాణం కొనసాగిస్తూ జీవనం సా గించేవాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న బువ్వమ్మ దర్గా జాతరలో భాగంగా అశోక్‌నగర్‌లోని తన ఇంటికి తాళం వేసి ఉదయం సమయంలో కుటుంబ స భ్యులతో కలిసి బువ్వమ్మ దర్గాకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చే సరికి తన ఇంటి తలుపు తాళం లేకపోవడానికి తోడు తలుపు లోపలి నుంచి లాక్‌ ఉండడాన్ని గమనించి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి బీరువా లలో ఉన్న7తులాల బంగారం, రూ. లక్ష నగదు, 20తులాల వెండి ఆభరణాల ను అపహరించుకొని వెళ్లిన్నట్లు తెలుసుకొని పోలీసుల దృష్టికి తీసుకవచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ బృందంచే చోరీ జరి గిన ఇంట్లో వేలిముద్రలతో పాటు మరికొన్ని ఆధారాలను సేకరించి గాలింపు చ ర్యలు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు.

Updated Date - 2020-11-29T04:12:51+05:30 IST