గర్భాన్ని తీసేయొద్దు.. నేను పెళ్లి చేసుకుంటానన్న యువకుడు.. నో చెప్పిన యువతి.. చివరకు వీళ్ల కథ ఎంత దూరం వెళ్లిందంటే..

ABN , First Publish Date - 2021-09-10T04:30:25+05:30 IST

యువతి భయాన్ని అలుసుగా తీసుకున్న ఓ రాక్షసుడు చేసిన దారుణం ఇది..

గర్భాన్ని తీసేయొద్దు.. నేను పెళ్లి చేసుకుంటానన్న యువకుడు.. నో చెప్పిన యువతి.. చివరకు వీళ్ల కథ ఎంత దూరం వెళ్లిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: చిన్న పరిచయం ద్వారా ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఆ తరువాత.. ఓ రోజు ఇంటికి ఆహ్వానించాడు. చివరికి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంతటి దారుణం జరిగినా కూడా పరువుపోతుందనే భయంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కొన్ని నెలల తరువాత.. తాను గర్భం దాల్చినట్టు ఆ యువతి గుర్తించింది. విషయాన్ని ఆ రాక్షసుడికి చెప్పింది. కానీ..అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ కొత్త ప్రస్తావన తెచ్చాడు. గర్భస్రావం చేయించుకోవద్దని బలవంతం పెట్టాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య రెండు నెలలుగా వాదోపవాదాలు నడిచాయి. 


యువతి మాత్రం పరువు పోతుందనే భయంతో అన్నీ సహిస్తూ వచ్చింది. ఈలోపు..అతడు సెప్టెంబర్ 4న ఆమెపై చేయి చేసుకున్నాడు. అంతకుమునుపు ఆమెపై మరోసారి అఘాయిత్యానికి కూడా పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పి కన్నీరుమున్నీరయ్యింది. ఆమె బాధ చూడలేని స్నేహితురాలు చివరికి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో.. వారు నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 



Updated Date - 2021-09-10T04:30:25+05:30 IST