Pak :కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్...ఆరుగురు సైనికాధికారుల దుర్మరణం

ABN , First Publish Date - 2022-08-02T14:28:45+05:30 IST

పాకిస్థాన్ దేశంలో ఆర్మీ హెలికాప్టర్(Pak army Chopper) కుప్పకూలిన(crashes) దుర్ఘటనలో...

Pak :కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్...ఆరుగురు సైనికాధికారుల దుర్మరణం

బలోచిస్థాన్(పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో ఆర్మీ హెలికాప్టర్(Pak army Chopper) కుప్పకూలిన(crashes) దుర్ఘటనలో ఆరుగురు పాక్ ఆర్మీ అధికారులు (Pak army officials)మరణించారు. పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ కార్పొరేషన్ కు(Pakistan Army Aviation Corps) చెందిన హెలికాప్టర్ సీనియర్ మిలటరీ అధికారులతో వెళుతుండగా బలోచిస్థాన్( Balochistan) ప్రాంతంలోని విందార్-పున్ను ష్రీన్ ల మధ్య కుప్పకూలిపోయింది. బలోచిస్థాన్ ప్రాంతంలో ఆచూకీ లేకుండా పోయిన ఆర్మీ హెలికాప్టరు కుప్పకూలిందని సహాయ సిబ్బంది విందార్- శస్సీ పున్ను ష్రీన్ వద్ద గుర్తించారు. కూలిన విమానంలో 12 మిలటరీ కార్ప్స్ కు చెందిన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సర్ఫారాజ్ అలీ ఉన్నాడని పాక్ ఆర్మీ అధికారులు చెప్పారు. 


పాక్ ఆర్మీ హెలికాప్టరు మాయమైందని అధికారులు గుర్తించారు. హెలికాప్టర్ ప్రమాదాన్ని పాక్ ఆర్మీ ఇంకా ధ్రువీకరించలేదు.పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఈ హెలికాప్టర్ వరద సహాయ పనుల కోసం వెళ్లి కుప్పకూలింది.వరద సహాయ పనులను పర్యవేక్షిస్తున్న ఆరుగురు ఆర్మీ అధికారులు కూలిన హెలికాప్టరులో ఉన్నారని సమాచారం. వరద సహాయ పనుల్లో మునిగిన హెలికాప్టర్ చివరిగా బలోచిస్థాన్ ఏటీసీ నుంచి కాంటాక్టు కోల్పుయింది.హెలికాప్టర్ కుప్పకూలడంతో ఆరుగురు పాక్ ఆర్మీ అధికారులు మరణించారని సమాచారం.  

Updated Date - 2022-08-02T14:28:45+05:30 IST