Abn logo
Apr 12 2021 @ 05:46AM

హెలికాప్టర్‌ క్రాష్‌ ల్యాండింగ్‌.. లులు గ్రూప్ అధినేతకు తప్పిన ప్రమాదం

లులు గ్రూప్‌ అధినేత యూసుఫ్‌ అలీకి తప్పిన ప్రమాదం

కేరళలోని కోచి సమీపంలో ఘటన.. యూసుప్‌ కుటుంబం క్షేమం


కోచి, ఏప్రిల్‌ 11: దిగ్గజ వ్యాపార వేత్త, లులు గ్రూప్‌ అధినేత ఎం.ఎ.యూసుఫ్‌ అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఆదివారం ఉదయం క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. ఈ ఘటన కేరళలోని కోచి సమీపంలో ఉన్న పనాన్‌గఢ్‌లో చోటుచేసుకుంది. యూఏఈ, గల్ఫ్‌, భారత్‌తోపాటు, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో 200కు పైగా లులు మాల్స్‌, హైపర్‌మార్కెట్లు, సూపర్‌మార్కెట్లు నిర్వహిస్తున్న ఎం.ఎ.యూసుఫ్‌ అలీ స్వస్థలం కేరళలోని కోచి. తన బంధుమిత్రులతో గడపాలని ఆయన ఇటీవల భారత్‌కు వచ్చారు. రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన తన హెలికాప్టర్‌లో ఆదివారం ఉదయం కోచి నుంచి.. ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు బయలుదేరారు. యూసుఫ్‌ వెంట ఆయన భార్య, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వర్షాల ఉధృతి, వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడంతో.. సేఫ్‌ ల్యాండింగ్‌ కోసం ఇద్దరు పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో పనాన్‌గఢ్‌లోని మత్స్య కళాశాల మైదానంలో హెలికాప్టర్‌ను దింపాలని నిర్ణయించారు. చిత్తడి నేలపై దిగడంతో.. హెలికాప్టర్‌ ఒక పక్కకు ఒరిగిపోయింది. హెలికాప్టర్‌లో ఉన్నవారంతా క్షేమంగా బయటకు వచ్చారు. 

Advertisement
Advertisement
Advertisement