భారత వ్యాపారవేత్తకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-04-12T05:09:27+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన భారతీయ వ్యాపారవేత్త, అంతర్జాతీయ రిటైల్ సంస్థ లులు గ్రూప్‌ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ, ఆయన భార్య, మరో నలుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ చిత్తడి నేలలో క్రా

భారత వ్యాపారవేత్తకు తప్పిన ప్రమాదం

కొచ్చి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన భారతీయ వ్యాపారవేత్త, అంతర్జాతీయ రిటైల్ సంస్థ లులు గ్రూప్‌ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ, ఆయన భార్య, మరో నలుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ చిత్తడి నేలలో క్రాష్ ల్యాండ్ అయింది. కూలిన హెలికాప్టర్ లులు గ్రూప్‌దే. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు యూసుఫ్ అలీ, ఆయన భార్య, మరో ఇద్దరు, ఇద్దరు పైలట్లను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  


అందరూ క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం వారంతా అబ్జర్వేషన్‌లో ఉన్నారని లేక్‌షోర్ ఆసుపత్రి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పనన్‌గడ్ ప్రాంతంలో ఈ ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ తెలిపింది. యూసుఫ్ అలీ ప్రస్తుతం కేరళలో ఉన్నారు.


సమీపంలోని ఆసుపత్రిలో ఉన్న తన బంధువును కలుసుకునేందుకు కొచ్చి నుంచి బయలుదేరారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ముందుజాగ్రత్త చర్యగా సురక్షితమైన స్థలంలో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయాలని భావించాడు. పైలట్ హెలికాప్టర్‌ను పననగడ్ ఎన్‌హెచ్ బైపాస్ సమీపంలోని చిత్తడి నేలలో సురక్షితంగా ల్యాండ్ చేయకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. 


Updated Date - 2021-04-12T05:09:27+05:30 IST