నేలకు అనువైన విత్తనాలు ఎంపిక చేసుకోండి

ABN , First Publish Date - 2021-10-28T06:40:29+05:30 IST

వివిధ పంటలకు సంబంధించి తమ ప్రాంతాల్లో నేలకు అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌) ఏడీఆర్‌ డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి రైతులకు సూచించారు.

నేలకు అనువైన విత్తనాలు ఎంపిక చేసుకోండి
రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న వ్యవసాయ వర్సిటీ ఈసీ సభ్యుడు మురళీనాథరెడ్డి

విత్తన దినోత్సవంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ ప్రశాంతి సూచన 


తిరుపతి(విద్య), అక్టోబరు 27: వివిధ పంటలకు సంబంధించి తమ ప్రాంతాల్లో నేలకు అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌) ఏడీఆర్‌ డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి రైతులకు సూచించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయవర్సిటీ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలోని ఆర్‌ఏఆర్‌ఎ్‌సలో విత్తన దినోత్సవం నిర్వహించారు. నూతన పంటలసాగు రకాలను క్షేత్రసందర్శన ద్వారా రైతులకు వివరించారు. అభ్యుదయ రైతులకు కొత్త వేరుశనగ విత్తనాలు, జీవన ఎరువులు, మట్టినమూనా ఆరోగ్యపత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోవు ఖరీ్‌ఫ(2022)కు వేరుశనగ, అపరాలు, చిరుధాన్యాలు, చెరకుపంటలో ధ్రువీకరించిన విత్తనాలను ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసి గ్రామీణ విత్తన పథకం, ఆర్బీకేల ద్వారా రైతులకు అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రైతులు తమపేర్లు ముందస్తుగా నమోదు చేసుకోవడం ద్వారా విత్తన కొరతను అధిగమించవచ్చని సూచించారు. ప్రతిరైతుకు సకాలంలో నాణ్యమైన విత్తనం అందించి దిగుబడులు పెంచేలా కృషి చేయాలని వర్సిటీ ఈసీ సభ్యుడు టీవీ మురళీనాథరెడ్డి శాస్త్రవేత్తలను కోరారు. శాస్త్రవేత్తలు రూపొందించిన ‘మొక్కల ప్రజననలో ప్రాదేశికసూత్రాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయకళాశాల ఏడీ రవీంద్రనాథరెడ్డి, వెటర్నరీ కళాశాల అసోసియేట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆదిలక్ష్మమ్మ, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు నాగపద్మిని, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ హేమంత్‌కుమార్‌, డాక్టర్‌ ఏఆర్‌కే రావ్‌, ఏరువాక కేంద్రం, కేవీకే శాస్త్రవేత్తలు, అభ్యుదయ.. మహిళా రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T06:40:29+05:30 IST