చొక్కనాథన్‌ ఆలయానికి రూ.90 లక్షలతో నెమలి, నంది వాహనాలు

ABN , First Publish Date - 2021-08-04T13:22:39+05:30 IST

విరుదునగర్‌ చొక్కనాథర్‌స్వామిని మాడవీధుల్లో ఊరేగించేందుకు వెండి నెమలి వాహనం, ప్రదోష నంది విగ్రహాల తయారవుతున్నాయి. విరుదునగర్‌లో ప్రసిద్ధిచెందిన ప్రాచీన చొక్కనాథర్‌ ఆ

చొక్కనాథన్‌ ఆలయానికి రూ.90 లక్షలతో నెమలి, నంది వాహనాలు

పెరంబూర్‌(చెన్నై): విరుదునగర్‌ చొక్కనాథర్‌స్వామిని మాడవీధుల్లో ఊరేగించేందుకు వెండి నెమలి వాహనం, ప్రదోష నంది విగ్రహాల తయారవుతున్నాయి. విరుదునగర్‌లో ప్రసిద్ధిచెందిన ప్రాచీన చొక్కనాథర్‌ ఆలయం హిందూ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. స్వామివారు మాఢవీధుల్లో విహరించేందుకు వెండి నెమలి, ప్రదోష నంది వాహనాల తయారీ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.. రూ.90 లక్షల విలువైన 70 కిలోల వెండితో ఈ వాహనాలు రూపుదిద్దుకోనున్నాయి. కుంభకోణం సమీపం సెంపనార్‌ ఆలయానికి చెందిన స్థపతి ఈ వాహనాలను తయారుచేస్తున్నారని ఆలయ నిర్వాహకులు రాందాస్‌ తెలిపారు.

Updated Date - 2021-08-04T13:22:39+05:30 IST