30లోపు ‘ఇన్‌స్పైర్‌ మనక్‌’కు నామినేషన్‌

ABN , First Publish Date - 2020-09-23T10:23:48+05:30 IST

ఇన్‌స్పైర్‌ మనక్‌ 2020-21కుగాను ఈనెల 30వ తేదీలోపు నామినేషన్‌ చేసుకోవాలని జిల్లా సైన్స్‌ అధికారి ఆర్‌వీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

30లోపు ‘ఇన్‌స్పైర్‌ మనక్‌’కు నామినేషన్‌

చిత్తూరు సెంట్రల్‌, సెప్టెంబరు 22: ఇన్‌స్పైర్‌ మనక్‌ 2020-21కుగాను ఈనెల 30వ తేదీలోపు నామినేషన్‌ చేసుకోవాలని జిల్లా సైన్స్‌ అధికారి ఆర్‌వీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో ఉన్నత పాఠశాల నుంచి కనీసం మూడు నుంచి ఐదు నామినేషన్లు రావాలని సూచించారు. సమాజశ్రేయస్సుకు ఉపయోగపడేలా ప్రయోగాలు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 97018 71545 నెంబరులో సంప్రదించాలన్నారు. 


విద్యాశాఖ ఏడీ-1గా పురుషోత్తం 

జిల్లా విద్యాశాఖలో ఏడీ (అసిస్టెంట్‌ డైరెక్టర్‌)-2గా ఉన్న పురుషోత్తంను ఏడీ-1గా నియమితులయ్యారు. ఏడీ-1లోని అనితారోస్‌రాణి ఏడీ-2 స్థానానికి వెళ్లనున్నారు. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ జారీచేసిన ఉత్తర్వులు మంగళవారం జిల్లా కార్యాలయానికి అందాయి. 

Updated Date - 2020-09-23T10:23:48+05:30 IST