చిత్తూరు/శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరుడికి తిరుపతికి చెందిన వజ్రాల చంద్రబాబు లక్ష్మీనారాయణ దంపతులు 117.480 గ్రాముల బంగారు వడ్డాణం వితరణగా ఇచ్చారు. మంగళవారం ఆలయ ఈవో పెద్దిరాజును కలసి అందజేశారు. ఆలయాధికారులు దాతలకు స్వామి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈవో ధనపాల్, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, పీఆర్వో హరిబాబు యాదవ్ పాల్గొన్నారు.