Abn logo
May 23 2020 @ 04:58AM

రైతు భరోసా కేంద్రాలు..అవసరమైనచోట పెట్టండి

చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు


చిత్తూరు రూరల్‌, మే 22: చిత్తూరు మండలంలో అవరమైనచోట రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం మండలంలో పర్యటించారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చూడాలని తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. తుమ్మిందలో రాయితీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. మార్గమధ్యంలో ఉపాధి కూలీల బాగోగులు తెలుసుకున్నారు. ఎంపీడీవో వెంకటరత్నం, వైసీపీ నేత త్యాగరాజు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement