Abn logo
Aug 15 2020 @ 17:56PM

చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు: జిల్లాలోని శాంతిపురం మండలం చిన్నూరులో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులు పార్వతమ్మ, దివ్యగా గుర్తించారు. కుటుంబ కలహాలే వీరి మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement