Abn logo
Nov 25 2021 @ 10:08AM

Chittoorలో 15 ఏనుగుల గుంపు హల్ చల్

చిత్తూరు: జిల్లాలోని పూతలపట్టు మండలం తుంబవారిపల్లి వద్ద  15 ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తోంది. పలు పంటలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఏనుగుల గుంపును సమీపంలోని అబ్బ గుంట అటవీ ప్రాంతాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏనుగుల గుంపు హల్‌‌చల్‌తో చుట్టుపక్క గ్రామాల ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల గుంపులో పలు గున్న ఏనుగులు కూడా ఉన్నాయి.