Abn logo
Oct 17 2021 @ 10:27AM

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా: తవణంపల్లి మండలం, తిరుపతి-బెంగుళూరు జాతీయ రహదారి, తెల్లగుండ్ల పల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.