Abn logo
Dec 3 2020 @ 09:11AM

చిత్తూరులో మళ్లీ మొదలైన తుపాను ప్రభావం

చిత్తూరు: నివర్ తుపానుతో అతలాకుతం అయిన జిల్లాలో  మరోసారి తుపాను ప్రభావం మొదలైంది. గత అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పాలసముద్రం, ఎస్‌ఆర్‌పురం, వెదురుకుప్పం, గంగాధర్ నెల్లూరు, కార్వేటినగరం మండలాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నిండుకుండలా తొణికిసలాడుతున్న చెరువులకు ప్రమాద స్థితి ఏర్పడనుంది. దీంతో ఎప్పుడు ఏ చెరువు తెగి ప్రమాదం ముంచుకొస్తుందో అన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement