చిత్తూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-07-01T11:27:19+05:30 IST

చిత్తూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

చిత్తూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

తిరుపతి: చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 98 రోజుల్లో 1,539 కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌లో 500  కేసులు పెరుగుదలకు పట్టిన సమయం 82 రోజులు కాగా...లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో 16 రోజుల్లో 1000 కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 10 గంటలకు జిల్లాలో 38 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1539గా ఉంది. అలాగే 572 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 960 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా...కరోనా బారిన పడి 7గురు మృతి చెందారు. మంగళవారం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మృతుడిది నగరి మండలంగా తెలుస్తోంది. తిరుపతి నగరంలో పాజిటివ్ కేసులు 264కు చేరాయి. ఒక్క రోజే తిరుపతి నగరంలో 14 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 67 మంది డిశ్చార్జ్ అవగా....197 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-07-01T11:27:19+05:30 IST