AP: స్వగ్రామానికి సాయితేజ భౌతికకాయం చేరడంపై సందిగ్ధత

ABN , First Publish Date - 2021-12-10T15:54:42+05:30 IST

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన సాయి తేజ భౌతికకాయం స్వగ్రామానికి ఎప్పుడు వస్తోందో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి.

AP: స్వగ్రామానికి సాయితేజ భౌతికకాయం చేరడంపై సందిగ్ధత

చిత్తూరు: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన సాయి తేజ భౌతికకాయం స్వగ్రామానికి ఎప్పుడు వస్తోందో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలు గుర్తు పట్టని విధంగా ఉండడంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపుకు ఆర్మీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గత రాత్రి ఆర్మీ బృందం సాయి తేజ ఇంటికి వచ్చి తల్లిదండ్రులు, పిల్లల నుంచి రక్త నమూనాలు సేకరించి  తీసుకెళ్లారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు  అందచేయాలి అంటే ఒకటి, రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. డీఎన్ఏ పరీక్షలు వీలుకాని పక్షంలో సాయి తేజ శరీరంపై ఉన్న గుర్తుల ద్వారా భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ఆలోచనలో ఆర్మీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అధికారులు సాయితేజ బంధువుల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. అవసరమైతే ఢిల్లీకి కుటుంబ సభ్యులను రావాలని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు విన్నవించారు. అయితే తాము వచ్చే పరిస్థితి లేదని శరీరంపై ఉన్న గుర్తుల ఆనవాళ్లకు సంబంధించిన క్లోజ్ అప్ ఫోటోల ద్వారా తెలియ పరిచేస్తే గుర్తుపట్టగలమని సాయి తేజ తమ్ముడు మహేష్ బాబు అధికారులకు తెలియజేశారు. 

Updated Date - 2021-12-10T15:54:42+05:30 IST