Abn logo
Jan 25 2021 @ 07:27AM

మదనపల్లి అక్కాచెల్లెళ్ల బలి కేసులో కొత్త కోణాలు

చిత్తూరు: జిల్లాలోని మదనపల్లిలో చోటు చేసుకున్న అక్కాచెల్లెళ్ల బలి విషయంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఉన్నత విద్యలు చదివిన పురుషోత్తమనాయుడు, పద్మజల ఇద్దరు కుమార్తెలను నిన్న ఉదయం వారు నివసిస్తున్న ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాక నాలుగు రోజుల నుంచి వీరి ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ జంట బలులు చేసేందుకు పురుషోత్తం, పద్మజలు స్థానిక బుగ్గవంకకు చెందిన ఒక స్వామీజీ సహాయం తీసుకున్నట్లు సమాచారంచిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం శివాలయంవీధిలో ఇద్దరు కుమార్తెలను తల్లే బలి తీసుకుంది. ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమనాయుడు, పద్మజలు గత మూడు రోజులుగా బయటి వ్యక్తులను పిలిపించి ఎడతెరపిలేకుండా పూజలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం తల్లితోసహా ఇద్దరు పిల్లలు నగ్నంగా పూజలు చేశారు. ఈక్రమంలో పూజగదిలోనే పెద్దకుమార్తె అలేఖ్యను పద్మజ.. డంబెల్‌తో నుదిటిపై మోదీ చంపేశారు. చనిపోయిన అలేఖ్యను పూజా క్రతువులో భాగంగా బతికించుకొనేందుకు రెండోకుమార్తె సాయిదివ్యను పైఅంతస్తులోని బెడ్‌రూమ్‌లో ఇదే తరహాలో భర్త ఎదుటే పద్మజ చంపేసింది. చంపే ముందే.. ఇద్దరు బిడ్డలను ఇంటిచుట్టూ తిప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement