వాగు దాటలేక వాయిదా పడ్డ పెళ్లి

ABN , First Publish Date - 2020-11-28T18:41:34+05:30 IST

నివర్ తుపాన్ ప్రభావంతో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు.

వాగు దాటలేక వాయిదా పడ్డ పెళ్లి

చిత్తూరు: నివర్ తుపాన్ ప్రభావంతో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక చోట రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. తాజాగా వాగు దాటలేక పెళ్లి వాయిదా పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పెద్ద మండ్యం మండలం పాపే పల్లి వద్ద వాగు ఉధృతి కారణంగా పెళ్లి కుమార్తె వాగు దాటలేకపోయింది. దీంతో పెళ్లి వాయిదా పడింది.  పెద్దమండ్యం మండలం పాపేపల్లి గ్రామానికి చెందిన మమతకు బీ. కొత్తకోట మండలం దేవరాజు పల్లికి చెందిన సుధాకర్‌కు గట్టు వద్ద  పెళ్లి జరగాల్సి ఉంది. నిన్నటి రోజు ఉదయం  ముహూర్తంగా నిర్ణయించారు. అయితే పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి బృందం పాపేపల్లి వద్ద వాగు దాట లేకపోవడంతో పెళ్లి వాయిదా పడింది. 

Updated Date - 2020-11-28T18:41:34+05:30 IST