Abn logo
Nov 27 2020 @ 09:11AM

ఎన్టీఆర్ జలాశయానికి భారీగా వరద నీరు

చిత్తూరు: నివర్ ప్రభావంతో జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాకు తాగునీరు అందించే కలవకుంట వద్ద ఉన్న ఎన్టీఆర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వెంటనే అధికారులు జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లు ఎత్తివేయడంతో జలాశయం వద్ద సందర్శకుల తాకిడి అధికంగా ఉంది. మరోవైపు గేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టు క్రింది భాగంలో ఉన్న గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు పెనుమూరు మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కింది భాగంలోని వరద నీటిలో  విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీగా చెట్లు కూలిపోయాయి. 

Advertisement
Advertisement
Advertisement