పింఛా ప్రాజెక్టుకు పోటెత్తిన వరద...తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-11-27T14:24:35+05:30 IST

జిల్లాలోని పించా ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అక్కడే ఉన్న పలువురు అధికారులకు పెను ప్రమాదం తప్పింది.

పింఛా ప్రాజెక్టుకు పోటెత్తిన వరద...తప్పిన ప్రమాదం

చిత్తూరు: జిల్లాలోని పించా ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అక్కడే ఉన్న పలువురు అధికారులకు పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని సదుం ప్రాంతంలో తెగిన చెరువు నీటితో పాటు భారీగా వస్తున్న వర్షపు నీరు రావడంతో పింఛా ప్రాజెక్టు వరద పోటెత్తింది. గురువారం రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ప్రాజెక్టు ఇన్‌ఫ్లో భారీగా పెరిగి పోయి గేట్లలో నీళ్లు పట్టక మరో వైపు నుంచి ప్రవహించింది. దాంతో పాటు ఆంజనేయస్వామి విగ్రహం దిమ్మ వరకు  ప్రాజెక్టు కట్టపైకి నీళ్లు వచ్చి చేరాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న ప్రాజెక్టు అధికారి మధుసూదన్‌రావు, పలువురు సిబ్బంది నీటిలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒడ్డుకు చేరుకున్నారు. సైరన్  ద్వారా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ప్రమాదకర హెచ్చరికలతో అప్రమత్తం చేశారు. పెద్దపల్లి, గురుపల్లిలను  ప్రజలు ఖాళీ చేశారు. ప్రస్తుతం పింఛా ప్రాజెక్టు వరదనీరు ఎక్కువ రావడంతో చాలా దెబ్బతినే పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-11-27T14:24:35+05:30 IST