Jul 30 2021 @ 22:36PM

నింగిని చూసి...

సినీ గేయరచయిత, దర్శకుడు బండారు దానయ్య కవి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘చిత్రపటం’. ఈ చిత్రం నుంచి బండారు దానయ్య కవి స్వయంగా రచించి సంగీతం అందించిన ‘నింగిని చూసి నేర్చుకున్న...’అనే పల్లవితో సాగే లిరికల్‌ గీతాన్ని రచయిత విజయేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. మంచి కథ, చక్కని టైటిల్‌, సంగీత సాహిత్యాల మంచి మేళవింపుతో ఈ చిత్రాన్ని తీసిన దర్శకనిర్మాతలను ఆయన అభినందించారు. 


‘‘మనుషుల జీవితాల్లోని భావోద్వేగాలను ఈచిత్రంలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం. తండ్రీకీ, కూతురికీ మధ్య సాగే కథతో ఈ సినిమా సాగుతుంది. సినిమాలోని ఏడు పాటలను నేనే రాయడంతో పాటు సంగీత దర్శకత్వం కూడా వహించాను’ ’ అని దర్శకుడు తెలిపారు. చిత్రం ట్రైలర్‌ను త్వరలో విడుదల చేస్తామని నిర్మాత పుప్పాల శ్రీధర్‌ చెప్పారు. పార్వతీశం, శ్రీవల్లీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, నరేన్‌, బాహుబలి ప్రభాకర్‌ ఇతర తారాగణం.