చిత్రదుర్గలో మినీ శబరిమలై

ABN , First Publish Date - 2021-12-27T19:03:23+05:30 IST

కొవిడ్‌ వేళ కేరళలోని శబరిమలై వెళ్లాలంటే భక్తులు కట్టుదిట్టమైన నియమాలను పాటించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులు స్థానిక ఆలయాల్లోనే పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. చిత్రదుర్గలో మేదెహళ్లి

చిత్రదుర్గలో మినీ శబరిమలై

                - మకరజ్యోతి వేళ లక్ష దీపోత్సవం జరిపే ఏకైక దేవాలయం


బెంగళూరు: కొవిడ్‌ వేళ కేరళలోని శబరిమలై వెళ్లాలంటే భక్తులు కట్టుదిట్టమైన నియమాలను పాటించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులు స్థానిక ఆలయాల్లోనే పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. చిత్రదుర్గలో మేదెహళ్లి అయ్యప్పస్వామి ఆలయం కూడా అచ్చం శబరిమలై ఆలయం మాదిరిగానే ఉంటుంది. అందుకే భక్తులు దీనిని మినీ శబరిమలైగా పిలుస్తుంటారు. బెంగళూరు, బీజాపుర, బాగల్కొటె, నంజనగూడు, తుమకూరు, హుబ్లి, శిరూరులో ప్ర ముఖంగా గుర్తింపు పొందిన అయ్యప్పస్వామి ఆలయాలు ఉన్నాయి. అయినా  భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి చిత్రదుర్గలోని ఈ ఆలయానికి విచ్చేస్తుంటారు. కర్ణాటక నుంచే కాకుండా గోవా, ఆంధ్రప్రదేశ్‌,  మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. అయప్పమాలలు వేసే సమయంలో ఈ ఆలయం శోభాయమానం లా ఉంటుంది. నిత్యం సంకీర్తనలతో అలరారుతుంటుంది. మకరజ్యోతి వేళ రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ లక్ష దిపోత్సవం జరుగుతుంది. ఈ వేడుకను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 

Updated Date - 2021-12-27T19:03:23+05:30 IST