చావులోనూ లంచం

ABN , First Publish Date - 2021-02-24T06:27:20+05:30 IST

తల్లి అంత్యక్రియల కోసం ప్రభుత్వం తరఫున డబ్బులు మంజూరు

చావులోనూ లంచం

 ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్‌

మదీన, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తల్లి అంత్యక్రియల కోసం ప్రభుత్వం తరఫున డబ్బులు మంజూరు చేయడానికి లంచం అడిగిన దక్షిణ మండలం జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ముసారాంబాగ్‌కు చెందిన క్రాంతికుమార్‌ తల్లి ప్రభుత్వ విభాగంలో పనిచేసి గత మే నెలలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియల కోసం ప్రభుత్వం నుంచి రూ.20 వేలు మంజూరయ్యాయి. క్రాంతి కుమార్‌ ఆ డబ్బుల కోసం పూల్‌బాగ్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-10లో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.10వేలు ఇస్తేనే అత్యక్రియల డబ్బులు మంజూరు చేస్తానంటూ ఇంజనీరింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌ పూల్‌సింగ్‌ డిమాండ్‌ చేశాడు. ఇవ్వకపోవడంతో ఫైల్‌ పెండింగ్‌లో ఉంచాడు. దీంతో క్రాంతికుమార్‌ రూ. 5 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద మా టువేసి పూల్‌సింగ్‌ను కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నుంచి రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.


రోగంలోనూ మోసం

  కేన్సర్‌ బాధితుడి నుంచి రూ.2 లక్షలు తీసుకున్న నిందితుడు 

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇప్పిస్తానంటూ కేన్సర్‌ బాధితుడి వద్ద రూ. 2 లక్షలు కాజేసిన వ్యక్తిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఒకరికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ. 15 లక్షలు ఇప్పిస్తానని పాతబస్తీకి చెందిన  అలీ ఖాద్రీ మభ్యపెట్టాడు. నమ్మిన బాధితుడు రూ. 2 లక్షలు సమకూర్చి ఇచ్చాడు. ఆ తర్వాత ఖాద్రీ పత్తా లేకుండా పోయాడు. ఆసుపత్రి బెడ్‌పై దీనస్థితిలో ఉన్న బాధితుడు తన డబ్బులు ఇప్పించాలని వీడియో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. బాధితుడి వీడియో వైరల్‌గా మారింది. చార్మినార్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఉదంతానికి స్పందించిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం నిందితుడైన మౌలానా అలీఖాద్రీని అదుపులోకి తీసుకుని, చార్మినార్‌ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-02-24T06:27:20+05:30 IST