స్విట్జర్లాండ్‌లో చిరుత

ఓవైపు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, మరోవైపు ‘ఆచార్య’ చిత్రీకరణలతో బిజీ బిజీగా గడిపేశారు రామ్‌ చరణ్‌. ఇప్పుడు కాస్త విరామం దొరికింది. అందుకే సరదాగా స్విట్జర్లాండ్‌లో వాలిపోయారు. తన సోదరితో కలిసి ఆయన విహారయాత్రకు వెళ్లారు. కొన్ని రోజులు అక్కడ సెలవుల్ని ఆస్వాదించి, ఇండియా తిరిగొస్తారు. వచ్చాక... ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ప్రమోషన్లు మొదలైపోతాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ట్రైలర్‌ని విడుదల చేస్తారు. 


Advertisement