Abn logo
Aug 11 2020 @ 00:17AM

‘చిరు’ కట్టె పరిగెల వేపుడు!

ఖాళీ సమయంలో ఏమీ తోచకపోతే వంటింట్లో గరిటె తిప్పుతుంటారు చిరంజీవి. లాక్‌డౌన్‌లో ‘చిరు’ దోశ రుచి చూపించారు. ఈ ఆదివారం ఏమీ తోచకపోవడంతో ఆయనకు వంట చేయాలనే ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు ఆయన తల్లి అంజనా దేవి తనకు తినిపించిన అనేక రుచుల్లో ఒకటైన కట్టె చేపల వేపుడు చేసి తన తల్లికి వడ్డించాలనుకున్నారు. అంతే.. ఆదివారం స్పెషల్‌గా గోదావరి జిల్లాల్లో దొరికే కట్టె పరిగెలను చింతకాయ గుజ్జుతో కలిపి తనదైన స్టైల్లో ఫ్రై చేశారు. వంట పూర్తయ్యాక తల్లికి దగ్గరుండి మరీ వడ్డించారు. అమ్మకు నచ్చుతుందో లేదో అన్న అనుమానంతో వడ్డించిన ఆయన ‘చాలా బావుంది’ అని అంజనా దేవి ప్రశంసించగానే చిరు ఆనందంతో మురిసిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


Advertisement
Advertisement
Advertisement