హైదరాబాదులో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు

ABN , First Publish Date - 2022-04-28T22:38:43+05:30 IST

నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. సికింద్రాబాద్

హైదరాబాదులో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. సికింద్రాబాద్, మారేడుపల్లి , బేగంపేట్ , రాణిగంజ్, ప్యారడైస్, చిలుకలగూడ, పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అలాగే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాలలోనూ చిరుజల్లులు పడుతున్నాయి.  నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణం కొంత మేరకు చల్లబడింది. ఎండల తీవ్రతతో సతమతమవుతున్న వారికి కాస్తంత ఉపశమనం కలిగింది. 

 

రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వానలు పడుతాయని, ఉత్తర తెలంగాణలో నాలుగు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది. కాగా గురువారం హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణం కొంత మేరకు చల్లబడింది. నగరంలో కూడా మరికొద్ది సేపట్లో అక్కడక్కడా చిరుజల్లలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Updated Date - 2022-04-28T22:38:43+05:30 IST